Widgets Magazine

ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచైనా సీటిస్తాం... జబర్దస్త్ టీం కమెడియన్‌కు వైసీపీ బంపర్ ఆఫర్

గురువారం, 13 జులై 2017 (14:21 IST)

Widgets Magazine
Hyper Aadi

జబర్దస్త్ షోలో నటిస్తున్న నటుల దశ తిరుగుతోంది. ఇప్పటికే జబర్దస్త్‌కు ఎక్కడ లేని క్రేజ్ రావడంతో పాటు ఆ కార్యక్రమాన్ని చూసిన మిగిలిన రాష్ట్రాల వారు తమతమ భాషల్లో కూడా అలాంటి కార్యక్రమాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రధానంగా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, హైపర్ ఆదిలే ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంటారు. వీరు మొదట్లో సాధారణ కెమడియన్లు. కానీ ఆ తరువాత ఒక్కసారిగా వీరికి క్రేజ్ పెరిగిపోయింది. 
 
వీరు ఎక్కడికి వెళ్ళినా జబర్దస్త్ టీం అంటూ గుర్తు పెట్టేస్తారు. అంతేకాదు నిక్ నేమ్‌లతో పిలిచేస్తుంటారు. కొంతమందికి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే మరికొంతమందికి రాజకీయ అవకాశాలే వచ్చాయి. అందులో హైపర్ ఆది ఒకరు. ఆది సొంత జిల్లా ప్రకాశం. ముందు నుంచే రాజకీయాల్లోకి వెళ్ళాలన్నదే ఆయన ఆలోచన. అయితే చివరకు కమెడియన్ గానే ఆయన ప్రస్తుతం స్థిరపడ్డారు. ఒక్కసారి క్రేజ్ పెరిగిన తరువాత రాజకీయ నాయకులతో పరిచయాలు కూడా పెరిగాయి.
 
అందులోను వైఎస్ఆర్ సిపి నేతలతో మరింత చనువు ఏర్పడింది హైపర్ ఆదికి. అదే ప్రస్తుతం ఆయనకు మంచి ఫలితాన్నిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్థమై పోయారు. ఇప్పటికే దీనిపై మాట్లాడి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. హైపర్ ఆదికి ఉన్న అభిమానుల క్రేజ్ చూస్తే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉందని వైసిపి భావిస్తోంది. అందుకే ఏ నియోజవర్గం అడిగితే ఆ నియోజకవర్గం ఆదికి ఇవ్వడానికి జగన్ కూడా సిద్థంగా ఉన్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ysrcp Jabardasth Bumber Offer Hyper Aadi

Loading comments ...

తెలుగు సినిమా

news

పల్సర్ సునీ.. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలను దిలీప్ భార్యకు ఇచ్చాడా? కావ్య అరెస్ట్ అవుతుందా?

మలయాళ సినీ నటుడు దిలీప్.. సినీ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన సంగతి ...

news

స్పైడర్ సెట్స్‌లో కడుపుబ్బా నవ్వుకున్న మహేష్.. వీడియో చూడండి..

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న స్పైడర్ సినిమా ఎప్పుడు ...

news

మళ్లీ మేకప్ వేసుకోనున్న జయప్రద.. తమిళనాడు, కేరళ రాష్టాల సరిహద్దుల్లో...

ప్రముఖ సీనియర్ నటి జయప్రద మళ్లీ తెరపై కనిపించనుంది. పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో ...

news

భావనపై లైంగికదాడికి 2013లోనే స్కెచ్. 1.5 కోట్లు ఇచ్చిన దిలీప్

గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు ...