గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (13:04 IST)

మోక్షజ్ఞ సినిమాకు భారీ బడ్జెట్.. రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా?

Mokshagnya
Mokshagnya
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రశాంత్ వర్మ ఈ నెల మొదట్లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 
 
ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ "హనుమాన్"కు తర్వాత మోక్షజ్ఞతో చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఈ సినిమా 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని టాక్ వస్తోంది. అయితే తను అనుకున్న విజువల్స్‌కి ఇంత బడ్జెట్ అవసరమని ప్రశాంత్ వర్మ అభిప్రాయపడ్డాడు. 
 
విజువల్ ఎఫెక్ట్స్‌కు భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుధాకర్ చెరుకూరి భారీగా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నాడు. మోక్షజ్ఞ సోదరి తేజస్విని ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.