శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (13:00 IST)

ముగ్గురు ATM దొంగల కథతో 1134 చిత్రం - హిట్ అవ్వాలన్న హీరో నందు

nandu with 1134 team
nandu with 1134 team
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.
 
2 నిమిషాల 28 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు. ATM దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్ చివరలో 'అన్నీ నువ్వనుకునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ' అంటూ వచ్చిన డైలాగ్.. ఈ సినిమాలో ఏదో కొత్త కోణం చూపించబోతున్నారని స్పష్టం చేస్తోంది.         
 
సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు.         
 
 *నందు మాట్లాడుతూ..* ‘నేను శరత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ డే నాడు ఇలా రావడం నాకు ఆనందంగా ఉంది. ఈ రోజు నేను ఇక్కడకు రావడానికి కారణం మా స్నేహబంధమే. ఉడతా భక్తిలా నేను కూడా ఈ సినిమాకు ఏమైనా చేయాలని అనుకుని వచ్చాను. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కుల దైవం వంటి వారు. వాళ్లే ఈ జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. క్షణం, పెళ్లి చూపులు అలానే మొదలయ్యాయి. ఎంత బడ్జెట్‌తో సినిమాను తీశామని కాదు.. కంటెంట్ ఉందా? లేదా? అన్నది ముఖ్యం.  ఆ నమ్మకంతోనే శరత్ ఈ సినిమాను తీశాడు. నో బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
 *శరత్ చంద్ర తడిమేటి మాట్లాడుతూ..* ‘ఈ సినిమాను మేం ఎంతో ప్యాషన్‌తో నిర్మించాం. జీరో బడ్జెట్, నో బడ్జెట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ చేశాం. ఈ సినిమాకు మేం ఏమీ ఖర్చు పెట్టలేదు. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. ఇలాంటి డార్క్ సబ్జెక్ట్‌ను అందరూ చూడాలని ఎలాంటి వల్గారిటీ, బూతులు పెట్టలేదు. అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న స్కాంల గురించి వివరించాను’ అని అన్నారు.
 
రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.