Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంతయితే చేస్తా అన్న దీపిక.. పారిపోతున్న నిర్మాతలు.. ఎందుకూ?

హైదరాబాద్, శుక్రవారం, 7 జులై 2017 (05:59 IST)

Widgets Magazine

దక్షిణ భారత చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై వేసిన తిరుగులేని స్టాంప్‌లలో దీపికా పడుకొనే ఒకరు. ఆమె అంగీకరించి సైన్ చేస్తే చాలు వందకోట్ల రాబడి తమ సినిమాకు గ్యారంటీ అంటూ వెంటబడే నిర్మాతలు కోకొల్లలు.  సంవత్సరాలుగా నిర్మించుకుంటున్న కెరీర్ పీక్ స్టేజీలో ఉంటున్న దీపిక ఒక సినిమాతో తనకు కలుగుతున్న ఆర్థికపరమైన నష్టాన్ని మరొకరూపంలో తీర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. తన ఫేస్ వాల్యూను ఆమె ఏ స్థాయికి పెంచేసిందంటే ఆ కటౌట్ ఏ సినిమాలో అయినా నటించాలంటే మూడు రెట్లు అధిక మొత్తం చెల్లించాల్సిందే. 
 
దీంతో దీపికా పదుకొనెను హీరోయిన్‌గా తీసుకునేందుకు నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నారట. ఎందుకంటే పారితోషికం 12 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తా! అని కండీషన్‌ పెడుతున్నారట. దీపిక ఇంత డిమాండ్‌ చేయడానికి కారణం సంజయ్‌ లీలా బన్సాలీ డైరెక్షన్‌లో చేస్తోన్న ‘పద్మావతి’ అని టాక్‌. ఈ సినిమా కోసం ఏకంగా 200కిపైగా డేట్స్‌ ఇచ్చారట. అందుకుగాను 12 కోట్లు పుచ్చుకున్నారని భోగట్టా. 
 
అయితే ఇన్ని రోజులు డేట్స్ ఇచ్చినందున దీపికా కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందట. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే తదుపరి చేయనున్న సినిమాలకు కూడా 12 కోట్లు తీసుకోవాల్సిందేనని ఫిక్స్‌ అయ్యారట. కానీ, నిర్మాతలు మాత్రం దీపికాకు అంత ఇవ్వడానికి ఫిక్స్‌ అవ్వడంలేదని సమాచారం. దాంతో బ్యూటీ మునగచెట్టు దిగక తప్పదని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఏమో పద్మావతి ఘన విజయం సాధిస్తే దీపికా ఇంకా ఎక్కువ డిమాండ్ చేసినా ఆశ్చర్య పడాల్సి ఉంటుందేమో.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నీ జత లేకా.. పిచ్చిది కాదా మనసంతా... బాహుబలికి మళ్లీ చేరువైన దేవసేన

మెచ్చేనులే దేవసేనా... బాహుబలి 2లో మెరుపులో మెరిసిన హంస పాటలో పల్లవిలో భాగం ఇది. దేవసేన ...

news

జై లవకుశ... కనీసం ఒక్క విషయంలోనైనా బాహుబలిని బీట్ చేస్తుందా?(వీడియో)

సహజమే. ఇప్పుడు ఏ చిత్రం విడుదలవుతున్నా బాహుబలి లెక్కల్లోకి తొంగి చూస్తున్నారు. తాజాగా ...

news

'తలైవా' రజినీకాంత్ జీవితంలో తొలి సెల్ఫీ... రికార్డువుతుందా అంటూ మెట్టమాస్‌లా...(వీడియో)

రజినీకాంత్. ఈ పేరు చెబితే దక్షిణాది సినీ అభిమానులు ఊగిపోతారు. సినిమాల్లో ఆయన చేసే ...

news

సముద్రమంత ద...ధైర్యం వుండాల... ఎన్టీఆర్ నత్తి, జై లవకుశ టీజర్(వీడియో)

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ విలనిజమ్ ...

Widgets Magazine