Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

16-ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్ పేరిట తమిళ బ్లాక్‌బస్టర్.. మార్చి తొలివారంలో రిలీజ్

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (19:13 IST)

Widgets Magazine

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ సంస్థ నుంచి వ‌రుస‌గా క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లోనే త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ "ధురువంగ‌ల్ ప‌దినారు(డి-16) తెలుగులో "16-ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌"పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. రెహ్మాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ధృవ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సింగ‌ర్ కమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేమ‌చంద్ర ఈ చిత్రంలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పారు.  ఇటీవ‌ల రిలీజైన ఫ‌స్ట్‌లుక్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మార్చి తొలివారంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ- త‌మిళంలో ఇటీవ‌ల రిలీజై ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న `ధ‌రువంగ‌ల్ ప‌దినారు` చిత్రాన్ని తెలుగులో `16-ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దించాం. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. మార్చి తొలివారంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్‌కి త‌మిళ‌నాట‌ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అక్క‌డ‌ ఇప్ప‌టికీ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. వాస్త‌వానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ నిర్మాత‌లు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్ చేసే ఉద్ధేశంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకోవాల‌నుకున్నా.. పోటీప‌డి మ‌రీ చేజిక్కించుకున్నాం. అందుకు త‌గ్గట్టే తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే చిత్ర‌మిది`` అన్నారు. కెమెరా:సుజిత్ స‌రంగ్, సంగీతం: జాకేష్ బిజోయ్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బేహద్ షూటింగ్‌లో ఫైర్.. కొంగును లాగి హీరో బయటికొచ్చేశాడు.. కానీ ఆమెను కాపాడాడు..?! (Video)

హిందీ సీరియల్ ''బేహద్'' షూటింగ్‌ సెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నటి ...

news

అనసూయ అదరగొట్టేసిందటగా.. విన్నర్‌లో సూయ సూయ అనసూయ అంటూ చిందులు..

''సోగ్గాడే చిన్ని నాయన''లో యాంకర్ అనసూయ స్పెషల్‌గా మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ...

news

నితిన్‌తో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో కె.కె.రాధామోహన్‌ భారీ చిత్రం

'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌ టైగర్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ...

news

పెరుగన్నంతో ఉల్లిపాయల్ని తింటే..? చికెన్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్‌తో ఉల్లి పెరుగు ఎందుకు?

పెరుగన్నంలో ఉల్లిపాయలను కలుపుకుని తింటే.. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సలహా ...

Widgets Magazine