24 కిస్సెస్.. మేకింగ్ వీడియో ఓ చిన్నపాటి.. నీలిచిత్రంలా వుందట..(video)  
                                       
                  
				  				  
				   
                  				  24 కిస్సెస్ సినిమా ప్రస్తుతం వివాదాస్పదమైంది. కుమారి 21ఎఫ్ చిత్రంతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హెబ్బా.. తాజాగా 24 కిస్సెస్ ద్వారా మరో హిట్ కొట్టాలనుకుంటుంది. ఇందులో భాగంగా ఈ సినిమాలో భారీగా హీరోకు ముద్దుల వర్షం కురిపించింది. అరుణ్ అదిత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్ వేగవంతంగా జరుగుతోంది.
	
				  
	
దీనికి సంబంధించిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న హెబ్బా పటేల్.. అక్కడ నుంచి వాకౌట్ చేసింది. ముద్దు సన్నివేశాలను అసభ్యకరమని చెప్పిన ఓ వ్యక్తికి హీరో అదిత్ అరుణ్ వివరణ ఇచ్చాడు. 
				  											
																													
									  
	 
	ఇంకా 24 కిస్సెస్ డైరక్టర్ అయోధ్యకుమార్ కృష్ణమశెట్టి ఈ సినిమా టైటిల్‌కు ముద్దు సన్నివేశాలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమా అంటూ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు నిలదీశారు. దీంతో చర్చాకార్యక్రమం రసాభాసగా మారింది. డైరక్టర్ స్టోరీని ఎత్తిచూపకుండా ముద్దు సన్నివేశాలనే ఎందుకు హైలైట్ చేశాడని.. చర్చలో పాల్గొన్న వక్తలు అడిగారు. 
				  
	 
	తల్లి ప్రేమను సినీ తెరపై చూపించకుండా ఈ ప్రేమను అదీ ముద్దు సన్నివేశాలను నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాన్ని ఇలా ఎందుకు చూపెట్టాలని అడిగారు. దీంతో హెబ్బా పటేల్ కలుగచేసుకుని తన పాత్ర మేరకే ఈ సినిమాలో నటించానని.. హీరోయిన్‌గా ఎంతవరకు నటించాలో అంతవరకే నటించానని.. ఇక ఇక్కడ నుంచి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	మరోవైపు 24 కిస్సెస్ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీన్ని మేకింగ్ వీడియో అనే కంటే ముద్దుల వీడియో అంటేనే సరిపోతుంది. ఈ సినిమాలో ముద్దులు హద్దులు దాటాయి. ఈ మేకింగ్ వీడియోను చూస్తే.. ఓ చిన్నపాటి నీలి చిత్రం లాగానే వుందని టాక్ వస్తోంది. ఎ సర్టిఫికేట్ వచ్చింది కదా..  ఈ సినిమాలోని ముద్దు సన్నివేశాలను విచ్చలవిడిగా తీశారు.