బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (16:23 IST)

96కు వంద రోజులు..

96కు వంద రోజులు పూర్తయ్యింది. 2018 అక్టోబర్ నాలుగో తేదీన రిలీజైన 96 సినిమా జనవరి 11 (2019)తో విజయవంతంగా పూర్తి చేసుకుంది. విజయ్ సేతుపతి, త్రిషల కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా మిగిలిపోయిన ఈ సినిమాను సి.ప్రేమ్ కుమార్ రూపొందించారు. ఎస్. నందగోపాల్ నిర్మించారు. గోవింద్ వసంత కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయి. 
 
రిలీజ్ అయిన నెలరోజులకే 96మూవీని టీవీలో టెలికాస్ట్ చేసారు. అయినా ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూసారూ అంటే, 96 అక్కడి ప్రేక్షకులను ఎంతలా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. మినిమం బడ్జెట్‌లో రూపొందిన 96, నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.