సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (11:54 IST)

త్రిష ''96'' అదిరింది.. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.. (వీడియో)

త్రిషకు వయసైపోయింది. లేటు వయసులో ఆఫర్లు రావట్లేదని కోలీవుడ్‌లో ప్రచారం సాగింది. సామి స్క్వేర్ నుంచి తప్పుకోవడంతో త్రిషకు ఇక అవకాశాలే రావని టాక్ వచ్చింది. అయితే తమిళంలో త్రిష తాజా సినిమా ట్రైలర్ ఆ వార్

త్రిషకు వయసైపోయింది. లేటు వయసులో ఆఫర్లు రావట్లేదని కోలీవుడ్‌లో ప్రచారం సాగింది. సామి స్క్వేర్ నుంచి తప్పుకోవడంతో త్రిషకు ఇక అవకాశాలే రావని టాక్ వచ్చింది. అయితే తమిళంలో త్రిష తాజా సినిమా ట్రైలర్ ఆ వార్తలన్నింటికీ చెక్ పెట్టేలా వుంది. తమిళంలో త్రిష ప్రధానమైన పాత్రగా '96' చిత్రం రూపొందింది. త్రిష జోడీగా విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. 
 
తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఇదే పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఓ సాంగ్ బిట్‌పై టీజర్‌ను కట్ చేశారు. ఈ టీజర్లో త్రిష గతంలోకంటే అందంగా కనిపిస్తోంది. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. మద్రాస్ ఎంటర్ ప్రైజస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.