శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:30 IST)

#SyeRaaNarashimhaReddy నిర్మాత భార్య నుంచి తమన్నాకు భారీ బహుమతి

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో యువ హీరో రామ్ చరణ్ నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్లుగా నయనతార, తమన్నాలు నటిస్తే, అతిథి పాత్రలో అనుష్క మెరిసింది. వీరితో పాటు అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి తదితరులు నటించారు. 
 
ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ కనకవర్షం కురిపిస్తోంది. విడుదలైన అన్ని సెంటర్లు, అన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. 
 
త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ నిర్మించిన చారిత్రాత్మ‌క చిత్రం ఇంత మంచి విజ‌యం సాధించ‌డంతో మెగాస్టార్ చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు. చిత్ర‌బృందం కూడా విజ‌యాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. 
 
ఇక 'సైరా' చిత్ర నిర్మాత చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా ఈ మూవీ విజ‌యాన్ని ఆస్వాదిస్తూ చిత్రంలో 'ల‌క్ష్మీ న‌ర‌సింహా రెడ్డి' పాత్ర పోషించిన త‌మ‌న్నాకి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చింది. ఖ‌రీదైన ఉంగ‌రాన్ని త‌మ‌న్నాకి బ‌హుమ‌తిగా ఇచ్చిన ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఉంగ‌రంతో త‌మ‌న్నా దిగిన ఫోటోని షేర్ చేసింది. 
 
ఈ  ఫోటో కింద "నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం" అంటూ ఉపాసన ఓ ట్వీట్ చేసింది. సైరా చిత్రంలో నరసింహా రెడ్డికి ప్రియురాలిగా, నర్తకిగా లక్ష్మీ పాత్రలో తమన్నా జీవించిన విషయం తెల్సిందే. ఈ పాత్రపై ఆమెకు ప్రశంసల వర్షం కురుస్తోంది.