గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (10:59 IST)

హైదరాబాద్ శివారులో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం భారీ సెట్

Pawan Kalyan
Pawan Kalyan
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ రెండవసారి చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
 
ప్రస్తుతం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఉస్తాద్ భగత్ సింగ్ కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు సినిమాలోని ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటారు.
 
ఈ చిత్రం ఫస్ట్ లుక్, మొదటి ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్‌లో కనిపించడం అభిమానులని అలరించింది.
 
ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, అశుతోష్ రానా, నవాబ్ షా, కెజిఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్,  టెంపర్ వంశీ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రం కోసం అయనంక బోస్  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా, ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, పుష్ప, రంగస్థలం వంటి హిట్ చిత్రాల స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరస్తున్నారు.
 
యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ యేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వంటి హిట్‌లను అందించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.
 
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ