ఎ.ఎన్.ఆర్. శతజయంతి ఆరంభం- స్టూడియోలో విగ్రహం ఆవిష్కరణ
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఈరోజే. 20, సెప్టెంబర్ 2023న వంద సంవత్సరాల జయంతి. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన భౌతికకాయాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతంలోనే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కినేని నాగార్జున, సుప్రియ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు సినీరంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
- అక్కినేని తన సినిమాలలో వాడిన డ్రెస్సులు, వస్తువులు, అవార్డులు కలిపి మ్యూజియం ఏరపాటు చేశారు. దానిపైన అప్పటి జర్నలిస్టు లకు వీలుగా సమావేశం జరుపుకునేందుకు గ్లాస్ రూమ్ కూడా కట్టించారు. అక్కడికి 30 అగుడుగుల దూరంలోనే ఆయన సమాధి ఉంది.
తెలుగు సీమంలో అక్కినేని నాగేశ్వరరావు స్థానం ప్రత్యేకమైనది. ఎందరికో స్పూర్తి ప్రదాత. నాలుగో తరగతి మాత్రమే చదివిన పల్లెటూరి అబ్బాయి నాటకరంగంలో అమ్మాయిల వేషం వేశాక చిత్రంగా చిత్రరంగంలోకి ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్.టి.ఆర్., ఎస్.వి.రంగారావు, కాంతారావు, రాజనాల వంటి ఎందరో ఉద్దండులున్న సినీమాలోకంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన డాన్స్‌లు అభిమానులు ఫిదా అయ్యేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నపూర్ణ స్టూడియోస్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించారు. వందలాది మందికి భృతి కల్పించారు. సెప్టెంబర్ 20న దేశదేశాల్లో అక్కినేని అభిమానులు ఎయన్నార్ శతజయంతి యేడాదిపాటు నిర్వహించనున్నారు.
` అక్కినేని తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ధర్మపత్న్రి. పి. పుల్లయ్య దర్శకత్వంలో 1941లో వచ్చింది. తొలిసారి ప్రధాన పాత్రలో కనిపించింది సీతారామజననం.. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 1944లో విడుదలయింది. శ్రీరామ పాత్రలో తొలిసారి కనిపించారు. ఘంటసాల బలరామయ్య మనవడే ప్రస్తుతం సంగీతాన్ని ఏలుతున్న థమన్.
` ఎన్నో పురస్కారాలు అందుకున్న ఎయన్నార్‌కు మూడు పద్మ అవార్డులు దక్కాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ లు దక్కాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ఎయన్నార్ పేరిట తను చనిపోయినా తన తరం జాతీయ స్థాయిలో ఎయన్నార్ అవార్డులు ఇచ్చేందుకు టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసి అందుకు తగిన నిధులను కూడా బ్యాంక్‌లో సమకూర్చారు.