గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (17:45 IST)

#VakeelSaabకు రూ.100కోట్ల ఆఫర్.. సమ్మర్‌కు రిలీజ్

Vakeel saab
సంక్రాంతి పండగ సందర్భంగా 'వకీల్ సాబ్' టీజర్‌ను విడుదలైంది. ఇందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి లాయర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ హక్కులకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో ముఖ్యపాత్రల్లోఅంజలి, నివేదా థామస్ నటిస్తున్నారు.
 
ఇప్పటికే ఓటీటీలో విడుదలకు అమేజాన్ ప్రైమ్ రూ. 100కోట్ల ఆఫర్ ప్రకటించింది. కానీ తాజాగా ఈ సినిమాను డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ రూ. 25 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. రూ. 15కోట్లకు జీ తెలుగు కొనుగోలు చేసినట్టు సమాచారం.
 
ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న ఉగాది కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.'వకీల్ సాబ్' సినిమాను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి థియేటర్స్‌లో విడుదలై టీవీల్లో కూడా వచ్చి ఉండేది.