శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (15:00 IST)

సినిమా కోసం బాన పొట్టను పెంచాడు.. తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడిన హీరో ఎవరు? (వీడియో)

సాధారణంగా హీరోలు... హీరోయిన్లు నిరతరం తమ ఫిట్నెస్‌ని కాపాడుకుంటూ వస్తారు. ఇందుకోసం వారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. శరీరంలోని ఏ ఒక్క భాగం పెరిగినా.. దాన్ని తక్షణం తగ్గించుకునేందుకు గంటల తరబడి కుస్త

సాధారణంగా హీరోలు... హీరోయిన్లు నిరతరం తమ ఫిట్నెస్‌ని కాపాడుకుంటూ వస్తారు. ఇందుకోసం వారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. శరీరంలోని ఏ ఒక్క భాగం పెరిగినా.. దాన్ని తక్షణం తగ్గించుకునేందుకు గంటల తరబడి కుస్తీలు పడుతుంటారు. అలాంటిది ఓ బాలీవుడ్ తనకు వచ్చిన బాన పొట్టను తగ్గించుకునేందుకు ఏకంగా కొన్ని నెలల పాటు కఠోరంగా శ్రమించాల్సి వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు ఆమిర్ ఖాన్. 
 
ఈయన తన ఫిట్నెస్ రహస్యాన్ని బహిర్గతం చేశారు. తన తాజా చిత్రం "దంగల్" కోసం ఆమిర్ ఖాన్ బాగానే కష్టపడ్డాడు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ ఓ ఇంటి పెద్ద పాత్రను పోషిస్తున్నాడు. తండ్రి కలలు కన్న ఆశయాన్ని కూతురు ఎలా నెరవేర్చిందనేదే 'దంగల్' సినిమా. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి కుటుంబ పెద్దగా ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడు. 
 
ఆమిర్ ఖాన్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ సినిమా పాత్ర కోసం ఆమిర్ ఖాన్ బరువు పెరగాల్సొచ్చింది. దీంతో ఎక్కడ లేని పొట్ట వచ్చింది. మళ్లీ ఆ పొట్ట తగ్గి సాధారణ స్థితికి రావడానికి ఆమిర్ ఖాన్ పడ్డ కష్టమే ఈ వీడియో.