మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (17:19 IST)

యాక్షన్ హీరో విశాల్ - ఎనిమి- డబ్బింగ్ ప్రారంభం

visal dubbing
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి `ఎనిమి` సినిమాతో ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. `ఎనిమి` సినిమా విశాల్‌కు 30వ సినిమా కాగా ఆర్యకు 32వ సినిమా.
 
ప్రస్తుతం ఈ  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరో విశాల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. తెలుగులో విశాల్ డబ్బింగ్ చెబుతున్నట్టు ఒక‌ వీడియో ద్వారా తెలిపారు. తెలుగులో డబ్బింగ్ చెబుతుంటే.. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్టైల్లో కనిపిస్తున్నారు.
 
గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాలిని రవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎనిమి టీజర్ ఎంతటి ఆదరణను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఆ టీజర్‌ను బట్టి చూస్తే.. ఇందులో హై యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.
 
ఆర్‌డీ రాజశేఖర్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.