గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (19:53 IST)

హాలీవుడ్‌కి కమెడియన్ అలీ (video)

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీల్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేశారు అలీ. సౌత్‌ నుంచి నార్త్‌ వరకూ తన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌ప్రెస్‌తో అన్ని స్టాపుల్లో నవ్వులు పంచారు. ఇప్పుడీ స్టార్‌ కమేడీయన్‌ ప్రయాణం హాలీవుడ్‌లోనూ మొదలుకానుంది. దర్శకుడు జగదీష్‌ దానేటి దర్శకత్వంలో తన హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఒక స్ట్రయిట్‌ హాలీవుడ్‌ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్‌ దానేటి అని చిత్రబృందం తెలిపింది. 
 
ఈ ఇండో హాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్‌ ఫిల్మ్స్, పింక్‌ జాగ్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తాయి. ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి విషయమై సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ను కలిశారు అలీ, దర్శకుడు జగదీష్‌ దానేటి. అనంతరం అలీ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌ సినిమా చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. హలీవుడ్‌ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్‌ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. 
 
దర్శకుడు జగదీష్‌ మాట్లాడుతూ – ‘‘ఇండో హాలీవుడ్‌ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్‌లో పరిచయం చేయడం అదృష్టంలా భావిస్తున్నాను. త్వరలోనీ మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు.