గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 26 నవంబరు 2021 (17:12 IST)

గ్రేట్ ధనుష్, పెద్ద మనస్సుతో శివశంకర్ మాస్టరుకు సాయం

శివశంకర్ మాస్టారు.. ముద్దుగా సినీపరిశ్రమలో పిలుచుకుంటూ ఉంటారు. మొత్తం 10 భాషల్లో సినిమాలకు కొరియోగ్రాఫరుగా పనిచేశారు శివశంకర్. ఎంతోమంది సినీ ప్రముఖులతో పరిచయం ఉంది. అయితే అలాంటి వ్యక్తి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యానికి గురై మంచాన పడ్డారు.

 
ఊపిరితిత్తులు 75 శాతానికి పైగా ఇన్ఫెక్షన్‌కు గురైంది. కరోనా సోకడం కారణంగా శివశంకర్ మాస్టర్‌కు ఆ పరిస్థితి వచ్చిందని వైద్యులు నిర్థారించారు. ఇప్పటికే ఆయన కుటుంబంలో చాలామంది కరోనాతో ఇబ్బంది పడుతున్నారు.

 
కానీ గత నాలుగు రోజుల నుంచి శివశంకర్ మాస్టర్ హైదరాబాద్ లోని ఎఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు. శివశంకర్ మాస్టర్ భార్య హోం క్వారంటైన్లో ఉండి చికిత్స చేసుకుంటోంది.

 
అయితే ఆసుపత్రిలో శివశంకర్ మాస్టర్ చేరిన వెంటనే ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడు. తాజాగా తమిళ నటుడు ధనుష్ 10 లక్షల రూపాయలను పిఎ ద్వారా శివశంకర్ మాస్టర్‌కు పంపించారు. ఆసుపత్రికి కావాల్సిన మొత్తం డబ్బులను తాను కడతానని హామీ ఇచ్చాడట దనుష్.

 
ముందుగా 10 లక్షల రూపాయలు ఇచ్చి వైద్యులతో ధనుష్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ధనుష్ ఇప్పటికే ఎంతోమందికి ఆర్థిక సహాయం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉన్నారు ధనుష్.