శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: శనివారం, 10 అక్టోబరు 2020 (20:47 IST)

అభిమానికి ముచ్చటగా క్షమాపణ చెప్పిన సినీ నటుడు మాధవన్

అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం “నిశ్శబ్దం”. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అక్టేబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన నటుడు మాధవన్ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా అభిమానులతో ట్విట్టర్లో ముచ్చటించారు.
 
ఈ క్రమంలో ఓ అభిమాని నిశ్శబ్దం ప్లాష్‌బ్యాక్ కన్విన్స్ చేసేలా లేదు. దీనికి మీరేమంటారు అని ప్రశ్నించాడు. దీనికి మాధవన్ స్పందిస్తూ ఇప్పుడు నేను కేవలం క్షమాపణ మాత్రమే చెప్పగలను అని మాధవన్ ముచ్చటగా సమాధానమిచ్చారు. ఇంకా తనకిష్టమైన సినిమా, సఖి అని తాను అద్భుతంగా నచించిన పాత్ర రాకెట్రీ అని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మాధవన్ వెల్లడించారు.
 
ఇక అటు నిశ్శబ్దం సినిమాలో మాధవన్ నెగటివ్ షేడ్స్ ఉన్న సైకో పాత్రలో నటించారు. మాధవన్‌తో పాటు అంజలి, శాలిని పాండే, మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కోన వెంకట్, టీజీ విశ్వ ప్రసాద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటించింది.