గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2024 (13:39 IST)

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

mohan babu
మీడియాపై దాడి కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం సాగుతుంది. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని తన నివాసం వద్ద మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు అజ్ఞాతంలో వెళ్లారనే ఊహాగానానాలు వెలువడుతున్నాయి. 
 
ఇదిలావుంటే, మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలో లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను హ్యాండోవర్‌ చేయాంటూ పోలీసులు నోటీసులు జారీ చేయగా, మంచు విష్ణు తన గన్‌ను అప్పగించారు. అయితే, మోహన్ బాబు మాత్రం ఇప్పటికీ గన్ అప్పగించలేదు. స్టేట్మెంట్ రికార్డు చేయడానికి వచ్చినపుడే గన్ అప్పగిస్తానని మోహన్ బాబు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని పహడీ షరీఫ్ పోలీసులు స్పష్టం చేశారు. తాను మెడికేషన్‌లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తానే విచారణకు హాజరవుతానని మోహన్ బాబు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.