గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (12:43 IST)

ఇంట్లోకి రాగానే... గట్టిగా కౌగిలించుకున్నాడు.. నేను కూడా..?

మీటూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నిహారిక సింగ్ కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టింది. బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్ధీన్ సిద్ధిఖీపై నిహారిక సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 2009లో నవాజుద్ధీన్‌తో కలిసి సినిమాలో నటించానని తెలిపింది. 
 
అప్పటి పరిచయంతో తనకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు. అలా ఏర్పడిన పరిచయంతో ఓ రోజు లంచ్‌కు పిలిస్తే వెళ్లాను. ఆ సమయంలో అతడు తనతో ప్రవర్తించిన తీరు తనకు నచ్చింది. ఆపై ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. దీంతో అతనిని బాగా నమ్మాను. 
 
అయితే ఓ రోజు.. ఉన్నట్టుండి.. ''నా ఇంటి ముందు ఉన్నానని ఫోన్ చేశాడు. వెంటనే అతడిని ఇంట్లోకి ఆహ్వానించాను. అతను ఇంట్లోకి రాగానే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను ఎంతగా వదిలించుకుందామని చూసిన వదల్లేదు. ఆ సమయంలో నేను కూడా అతడితో క్లోజ్ అయిపోయాను. పరేష్ రావల్, మనోజ్ బాజ్ పేయ్ మాదిరి తనకి కూడా మిస్ ఇండియాని పెళ్లి చేసుకోవాలని కోరిక" అంటూ చెప్పాడు. 
 
అతడి మాటల్ని నమ్మి మోసపోయాను. ఆ తర్వాతే తెలిసింది. అతడికి అప్పటికే వివాహం జరిగిపోయిందని.. వరకట్నం వేధింపుల కేసులు కూడా వున్నాయని.. అంతేకాదు.. చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని కూడా వెల్లడి అయ్యింది. తన ఫోన్ నుంచే చాలామందికి ఫోన్ చేసి.. కథలు చెప్పేవాడని నిహారికా సింగ్ చెప్పింది. 
 
అతడి గురించి తెలిసి దూరమైన తరువాత కూడా తనతో సెక్స్ రిలేషన్ పెట్టుకోవాలని చూశాడు. కామంతో అతడి కళ్లు కప్పుకుపోయాయి. తను రాసిన పుస్తకంలో కూడా తమ రిలేషన్ గురించి అసత్యాలు రాశాడమి నిహారికా సింగ్ చెప్పింది.