హీరో శరత్ కుమార్‌కు కరోనా పాజిటివ్ : వెల్లడించిన భార్య రాధిక
తమిళ, తెలుగు సినీ నటుడు, రాజకీయ నేత శరత్ కుమార్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయన గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన భార్య, సీనియర్ సినీ నటి రాధక తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
తన భర్త శరత్‌కు హైదరాబాదులో ఉన్నపుడు కరోనా సోకింది. టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శరత్‌కు అసింప్టొమేటిక్ లక్షణాలు వచ్చాయి. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అందిస్తుంటానని రాధికా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.