గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (11:35 IST)

ప్రముఖ తమిళ సినీ నటుడు ప్రభుకు అస్వస్థత - ఆస్పత్రిలో చికిత్స

Prabhu
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ప్రభు అనారోగ్యం కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతూ వచ్చారు. ఈయన కిడ్నీలో రాళ్లు చేరినట్టు వైద్యులు గుర్తించారు. వీటిని లేజర్ సర్జరీ ద్వారా కరిగించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగపడుతుందని, ఎలాంటి ఆందోళనక్కర్లేదని పేర్కొన్నారు. 
 
తమిళ నటుుడు నడిగర్ తిలగం శివాజీ గణేశన్ కుమారుడుగా వెండితెరకు పరిచయమైన ప్రభు ఆ తర్వాత తన ప్రతిభతో సినిమా పరిశ్రమలో రాణిస్తున్నారు. ఆయన తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సుపరిచితమే. 
 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన "డార్లింగ్" మూవీలో హీరో తండ్రిగా ప్రభు నటించారు. అలాగే, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన "చంద్రముఖి" చిత్రంలో జ్యోతికకు భర్తగా నటించారు. తాజాగా విజయ్ నటించిన "వారసుడు" చిత్రంలో ఒక డాక్టరుగా కనిపించారు. ప్రస్తుతం ఆయన చెన్నై కోడంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.