పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం: అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ సేవలు
కన్నడ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పునీత్ బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఒక మంచి మనసున్న మనిషిగా పేరు సంపాదించుకున్నారు.
అయితే అక్టోబర్ 29వ తేదీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం ఇప్పటికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన మరణించిన ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగాలి అంటూ ఇప్పటికే యంగ్ హీరో విశాల్ వంటి వారు పునీత్ చేస్తున్న కొన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజు సైతం పునీత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ జన్మదినోత్సవం రోజున ఆయన జ్ఞాపకార్థం మార్చి 26వ తేదీ అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలోనే పునీత్ రాజ్‌పై అభిమానంతో ప్రకాష్ రాజ్ అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఇదే కాకుండా ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.