మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (23:17 IST)

విశాల్-వరలక్ష్మీ ప్రేమాయణం.. శరత్ కుమార్ ఏమన్నారంటే?

ప్రముఖ నటుడు విశాల్‌తో వరలక్ష్మీ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రూమర్లు కూడా వచ్చాయి. అయితే నడిగర్ సంఘం ఎన్నికలతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తుంది. శరత్ కుమార్ మీద విశాల్ ఆరోపణలు చేయడం, దానికి ప్రతి స్పందనగా వరలక్ష్మీ కౌంటర్లు వేయడం అందరికీ తెలిసిందే. ఆ గొడవలతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. 
 
మొత్తానికి వరలక్ష్మీ, విశాల్ ఇప్పుడు ఫ్రెండ్స్‌గా కూడా ఉండటం లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే తాజాగా కూతురి ప్రేమాయణం మీద శరత్ కుమార్ స్పందించాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసులోని మాటను శరత్ కుమార్ బయటపెట్టాడు.
 
ఇండస్ట్రీలో అలాంటివన్నీ కామన్ అని… ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుందని తెలిపాడు. ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయని, వీటికి భయపడకూడదు అని అన్నారు. అవన్నీ మా అమ్మాయి దాటేసిందని… ఇప్పుడు అంతా బాగుంది అన్నారు. తనకు అన్నీ తెలుసు అంటూ వరలక్ష్మీ గురించి శరత్ కుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.