శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (09:26 IST)

బెంగుళూరులో తారకరత్న కొనసాగుతున్న చికిత్స

tarakaratna
తీవ్ర అస్వస్థతకు గురైన హీరో నందమూరి తారకరత్నకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో  చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గురువారం ఎమ్మారై స్కానింగ్ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆయన మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నట్టు వివరించారు. 
 
ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం మెడికల్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, తారకరత్నకు చికిత్స కోసం విదేశీ వైద్యులను రప్పించినట్టు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ ఇటీవల తెలిపారు.