Widgets Magazine

నిద్రపట్టక వరుణ్‌కి, అమ్మకి చెప్పే మాత్రలు మింగాను.. ఆత్మహత్య అంటారా. వాపోయిన వితిక

హైదరాబాద్, శుక్రవారం, 14 జులై 2017 (06:40 IST)

Widgets Magazine
Varun Sandesh's wife Vithika

నిద్రపట్టకపోతే స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకున్నా. ఆ టాబ్లెట్స్‌ వల్ల ఓ పదీ పన్నెండు గంటలు నిద్రపడుతుంది. అంతసేపు నిద్రపోతానని తెలియక మా అమ్మ కంగారు పడిపోయారు. ఆ కంగారు ఇంత సెన్సేషన్‌ అవుతుందనుకోలేదు అంటూ వాపోయారు వరుణ్ సందేశ్ సతీమణి వితిక. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో నటిస్తున్నప్పుడు వరుణ్‌ సందేశ్‌–వితికా శేరు ప్రేమలో పడ్డారు. గతేడాది పెళ్లి చేసుకున్నారు.వచ్చే నెల 19తో వీళ్ల పెళ్లై ఏడాది అవుతుంది. ఈలోపు ‘వైవాహిక జీవితం బాగా లేకపోవడంతో వితిక సూసైడ్‌ అటెంప్ట్‌’ అనే వార్త సంచలనం సృష్టించడంతో ఫ్యామిలీ మొత్తం అదిరిపోయింది. ఇంతకు ఏం జరిగింతో వితిక మాటల్లోనే విందాం.
 
స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకోవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. నేను, వరుణ్‌ అమెరికాలో ఉంటున్నాం. మా చెల్లెలు (పిన్ని కూతురు) ఓణీల ఫంక్షన్‌ ఉంటే, హైదరాబాద్‌ వచ్చాను. మా ఇంటి (వరుణ్‌–వితిక ఉంటున్న ఇల్లు)కీ, మా అమ్మగారింటికీ పెద్ద దూరం లేదు. జస్ట్‌ పది నిమిషాల్లో వెళ్లొచ్చు. అందుకే ఒంటరిగా ఉన్నాను. మన టైమింగ్స్, అమెరికా టైమింగ్స్‌ డిఫరెంట్‌ అని తెలిసిందే. ఇక్కడి టైమ్‌కి తగ్గట్టు అడ్జస్ట్‌ కావడానికి ఐదారు రోజులైనా పడుతుంది. నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం అదే. 
 
గురువారం దుబాయ్‌లో షూట్‌ ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఫేస్‌ బాగుండదు. దాంతో పాటు మెంటల్లీ కొంచెం స్ట్రెస్‌ అయ్యాను. అందుకని మా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్‌ చేస్తే, ఆమె టాబ్లెట్‌ సజెస్ట్‌ చేసింది. మెడికల్‌ షాప్‌ నుంచి తెప్పించుకుని, వేసుకున్నాను. అది కూడా 0.5 మిల్లీగ్రామ్‌ టాబ్లెట్‌. అది పెద్ద డోస్‌ కూడా కాదు. కాకపోతే నేను నాలుగు వేసుకున్నాను. అందుకే ఎక్కువసేపు నిద్రపోయాను. నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటున్నానని అటు వరుణ్‌కీ, ఇటు మా అమ్మకీ ఫోన్‌ చేసి, చెప్పాను. 
 
ఆదివారం రాత్రి పదకొండు పన్నెండు గంటలకు మాత్రలు వేసుకున్నాను. మా అమ్మగారు సోమవారం ఉదయం ఏడు గంటలకు ఫోన్‌ చేసింది. నేను మాంచి నిద్రలో ఉండటంతో తీయలేదు. దాంతో టెన్షన్‌ పడి, మా ఇంటికి వచ్చింది. ఎంత లేపినా నేను లేవకపోవడంతో బేగంపేటలో ఉన్న నా కజిన్‌కి ఫోన్‌ చేసింది. నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఎన్ని టాబ్లెట్స్‌ వేసుకున్నానో డాక్టర్స్‌కి కూడా తెలియదు కాబట్టి, ‘స్ట్టమక్‌ వాష్‌’ చేస్తామన్నారు. అమ్మ సరేనంది. జరిగింది ఇదే. ఆ రోజంతా హాస్పిటల్‌లో ఉండి, మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యి, ఇంటికొచ్చాను.
 
యాక్చువల్‌గా మాది మూడేళ్ల అనుబంధం. పెళ్లికి ముందు రెండేళ్లు ప్రేమించుకున్నాం. ఒకర్నొకరు అర్థం చేసుకున్నాకే, పెళ్లి చేసుకున్నాం. మా మధ్య ఎలాంటి ఇష్యూస్‌ లేవు. నరేశ్‌ అన్న (‘అల్లరి’ నరేశ్‌), ఇంకా ఇండస్ట్రీలో క్లోజ్‌ ఫ్రెండ్స్‌ చాలామంది ఉన్నారు. మా మ్యారీడ్‌ లైఫ్‌ ఎంత బాగుందో వాళ్లందరికీ తెలుసు. వరుణ్‌ నాకు బెస్ట్‌ ‘సోల్‌మేట్‌’  అందుకని కెరీర్‌ ఏమవుతుందో అని ఆలోచించలేదు. పెళ్లి చేసుకున్నాను అంటూ ఈ మొత్తం ఎపిసోడ్‌లో మీడియా చేసిన తొందరపాటును ఎత్తిచూపింది వితిక.
 
మరోవైపున వితిక భర్త, సినీ నటుడు వరుణ్ సందేశ్ అయితే నిద్రపట్టలేదు. మాత్రలు వేసుకుంటాను అంటే ఒకే అన్నాను. వితిక సూసైడ్‌ చేసుకునేంత పిరికమ్మాయి కాదు అని తేల్చి చెబుతున్నాడు వరుణ్ సందేశ్. 
 
‘స్లీపింగ్‌ టాబ్లెట్‌ వేసుకుంటున్నా నానా’ (వరుణ్‌ని వితిక నానా అని పిలుస్తారు) అని నాకు చెప్పింది. నేను కూడా ఓకే అన్నా. వితిక నిద్ర పట్టక గింజుకుంటుంది. అది నాకు తెలుసు కాబట్టే, నిద్రమాత్రలు వేసుకుంటానంటే ఓకే అన్నాను. పైగా అదేం తనకు హ్యాబిట్‌ కాదు. వితిక లేని జీవితం ఊహించలేను. తను లేకుండా నేను లేను. నా బిగ్గెస్ట్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ తను. వితిక సూసైడ్‌ చేసుకునేంత పిరికమ్మాయి కాదు. వెరీ స్ట్రాంగ్‌ అండ్‌ ఇండిపెండెంట్‌. మా బంధం చాలా బలంగా ఉంది. ముందు ముందు మరింత బలపడుతుందనే నమ్మకం ఉంది.
 
ఇంత స్పష్టంగా వీరు తమ జీవితం పట్ల అభిప్రాయాలు చెబుతుంటే ఆమెది ఆత్మహత్యా ప్రయత్నం అని రాస్తే మీడియా ఎక్కడ తలపెట్టుకోవాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఈ ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నాయి కదా.. నేనే దొరికానంట్రా మీకు... తెల్లమ్మాయి ఫైర్

పుకార్లకు కొత్త నిర్వనమిచ్చి మెరుపువేగంతో ప్రపంచమంతా పాకిస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు ఆ ...

news

ఎఫైర్ బయటపెట్టిందనీ, ఆ పని చేసి నగ్న ఫోటోలు తీయమన్నాడా...?(వీడియో)

గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు ...

news

విలన్ పాత్రలో నటి కాజోల్... రజినీ అల్లుడు ధనుష్ విఐపి2లో...

కాజోల్..ఒకప్పుడు అటు తెలుగు, హిందీ చలన చిత్ర సీమను శాసించిన హీరోయిన్. కాజోల్, షారుఖ్ ...

news

తండ్రిని బాధపెట్టే ఏ పని నేనూ, సమంత చేయబోం.. పెళ్ళికి తర్వాత కూడా: చైతూ

టాలీవుడ్ ప్రేమికులు సమంత, నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. తమ వివాహం కోసం సినిమా ...