గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (13:38 IST)

కరోనా వైరస్ బారినపడిన మరో కోలీవుడ్ హీరో

తమిళ చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరో విష్ణు విశాల్ పాజిటివ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ఇప్పటికే చిత్రపరిశ్రమకు చెందిన హీరోయిన్లు త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్, నటుడు సత్యరాజ్, దర్శకుడు ప్రియదర్శన్ తదితరులు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా నటుడు విష్ణు విశాల్‌కు ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు ఆయన ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
"పాజిటివ్ రిజల్ట్స్‌తో 2022ను ప్రారంభిచాను. అబ్బాయిలూ... అవును నాకు కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. గత వారంలో నన్ను ఎవరైనా కలిసివున్నట్టయితే దయచేసి జాగ్రత్త వహించండి. భయంకరమైన శరర నొప్పులు, ముక్కు దిబ్బడ, కొంతు దరద, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయి. త్వరలో బౌన్స్ బ్యాక్ అవుతా" అంటూ ట్వీట్ చేశారు.