పిరుదు నొక్కిన దర్శకుడు.. చెంప పగులగొట్టిన సినీ నటి... (Video)

geethika thyagi
Last Updated: గురువారం, 11 అక్టోబరు 2018 (12:23 IST)
తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దర్శకుడుకి ఓ హీరోయిన్ తగిన గుణపాఠం చెప్పింది. ఎవరూ లేకుండా చూసి నటి గీతిక త్యాగి పిరుదును ఓ బాలీవుడ్ దర్శకుడు సుభాష్‌ కపూర్ నొక్కాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చి చెంప పగులగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నటి బిపాసా బసు ప్రధాన పాత్రలో వచ్చిన "ఆత్మ" అనే చిత్రంలో నటించింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలీవుడ్‌లో వచ్చిన 'జాలీ ఎల్‌ఎల్‌బీ' దర్శకుడు సుభాష్‌ కపూర్‌ తనను లైంగికంగా వేధించాడని నటి గీతిక త్యాగి ఆరోపిస్తోంది. సుభాష్‌కు ఎడమ చేయి లేదు. అయినప్పటికీ ప్రతిభతో మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తారని బాలీవుడ్‌లో అతనికి పేరుంది. కానీ సుభాష్‌ నిజ స్వరూపం ఇది అంటూ ఆయనకు సంబంధించిన ఓ వీడియోను గీతిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. 
 
సుభాష్‌ ఎలాంటివాడో చెప్పడానికి గీతిక అతన్ని, అతని భార్య డింపుల్‌ను ఓ స్టూడియోకు రమ్మన్నారు. ఆ సమయంలో సుభాష్‌ తన భార్యకు జరిగినదంతా చెబుతూ తన తప్పేంలేదని సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు వీడియోలో కన్పించారు. సుభాష్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ గీతిక ఏడ్చారు. భార్య పక్కనుండగానే గీతిక అతని చెంపపై కొట్టారు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవడంతో బయటకు వచ్చింది. 
 
సుభాష్‌ తన భార్య ముందు ఏదో చెబుతున్న వీడియోను గీతిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే గీతిక పోస్ట్‌ చేసిన వీడియోలో సుభాష్‌ను తిడుతున్నట్లు మాత్రమే ఉంది. అతన్ని కొట్టిన దృశ్యాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. కానీ ఆ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవడంతో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 దీనిపై మరింత చదవండి :