గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత

namitha - twins boys
సినీ నటి నమిత పండండి కవల పిల్లలకు జన్మించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాఖాతాలో వెల్లడించారు. గత 2017లో నటుడు, వ్యాపారవేత్త అయిన వీరేంద్ర చౌదరిని ఆమె వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిపోయిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చి నెలలు నిండాయి. దీంతో చెన్నై క్రోంపేటలోని రేలా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. 
 
ఈ భార్యాభర్తలిద్దరూ తమ కవల పిల్లలను ఎత్తుకుని నిలబడిన ఫోటోలు, ఓ వీడియోను సోషల్ మీడియాలో నమిత షేర్ చేశారు. ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 
 
అభిమానుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు తమతో ఉంటాయన్నారు. ఇకపైనా అవి కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిశువులు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు.