శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (16:22 IST)

బన్నీ మీద నాకు క్రష్ వుంది... హీరోయిన్ ప్రియాంక

గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా.... రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. ఈ వేడుకకు "స‌ద‌ర‌న్ స్టార్‌" అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయ‌డం విశేషం. టాక్సీవాలా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.... మంచి ప్రశంసలు అందుకుంది. యు.ఏ సర్టిఫికెట్‌తో టాక్సీవాలా నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
 
ఈ సంద‌ర్భంగా ఆదివారం జెఆర్‌సిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా జ‌రుపుకున్న సంద‌ర్భంగా ....
 
ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం మాట్లాడుతూ... ఇటీవ‌లే విజ‌య్‌ది నాది గీత‌గోవిందం విడుద‌ల‌యింది. ఆయ‌న గురించి గ‌తంలోనే స్టేజ్ మీద చెప్పాను సంస్కార‌వంతుడు అని. నా కెరియ‌ర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్న టైంలో అర‌వింద్‌గారు, బ‌న్నీగారు న‌న్ను గుర్తించి అవ‌కాశం క‌ల్పించినందుకు థ్యాంక్స్. ఈ టాక్సీవాలాకి సంబంధించిన యూనిట్ మొత్తం నాకు కావ‌ల్సిన‌వాళ్ళే. రాహుల్ నీ డెడికేష‌న్ నేను చూసేవాడ్ని. నాకు మంచి జ‌రిగింది నీకు కూడా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను. టాక్సీవాలా పెద్ద హిట్ కావాలి కోరుకుంటున్నాను. అర‌వింద్‌గారు మాలాంటివాళ్ళ‌కి ఇలా అవ‌కాశాలు ఇవ్వాలి. విజ‌య్ హ‌వా ఇలానే సాగాలి. హీరోయిన్ ప్రియాంక్ ఆల్ ద బెస్ట్‌. ఈ సినిమాకి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క టెక్నీషియ‌న్‌కి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ జేక్స్‌బేజాయ్ మాట్లాడుతూ... ముందుగా న‌న్ను ఆద‌రించినందుకు, మ‌న‌స్ఫూర్తిగా నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన‌, యు.వి.క్రియేష‌న్స్‌కి, గీతాఆర్ట్స్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడు రాహుల్‌కి కూడా నా కృత‌జ్ఞ‌త‌లు. విజ‌య్ కూడా చాలా స‌పోర్ట్ చేశాడు. మీరంద‌రూ థియేట‌ర్స్‌కి వెళ్ళి సినిమాని చూడాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ... కొత్త టాలెంట్‌ని ఎంక‌రేజ్ చెయ్య‌డంలో మా బ‌న్నీబాబు ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈ ఫంక్ష‌న్ చాలా హెల్దీగా సాగుతుంది. ఒక ప్రౌడ్ మూమెంట్ చెప్పాలి. నిన్న కేర‌ళ‌లో చూశాను. బ‌న్నీని మ‌నం ఎలాగైతే అభిమానిస్తున్నామో. వాళ్ళు కూడా అలాగే అభిమానిస్తున్నారు. ఆ విష‌యంలో చాలా హ్యాపీ. 
 
రాహుల్ చెప్పిన క‌థ‌ని విజ‌య్ న‌మ్మి మా ఎస్‌కెఎన్ అలాగే యువి క్రియేష‌న్స్‌, గీతా ఆర్స్ట్ రెండు బ్యాన‌ర్స్ మీద రావ‌డం సంతోషంగా ఉంది.  టాలెంట్ ఉన్నవ్య‌క్తులు అంద‌రూ క‌లిసి తీసిన చిత్ర‌మిది. సినిమా అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి తీశారు. ఈ సినిమాని అంద‌రూ చూసి ఆద‌రించాలి. ఎస్‌కెఎన్‌, నేను క‌లిసి జ‌ర్నీని స్టార్ట్ చేశాం. ఎస్‌కెన్ మంచి ప్రొడ్యూస‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను. రాహుల్‌కి కూడా మంచి పేరు రావాలి. విజ‌య్ కూడా చాలా నేచ‌ర‌ల్‌గా యాక్టింగ్ చేశాడు. అంద‌రూ ఆద‌రించి ఈ టీమ్‌ని బ్లెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాను అంద‌రికీ థ్యాంక్యూ అని అన్నారు.
 
చిత్ర హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ... ఇక్క‌డ‌కి విచ్చేసిన బ‌న్నీగారికి ముందుగా నా కృత‌జ్ఞ‌త‌లు. నాకు మీ మీద క్ర‌ష్ ఉంది. నేను మీకు పెద్ద అభిమానిని. నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.