శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 22 మే 2018 (14:17 IST)

డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిన ఇడియట్ హీరోయిన్?

హీరోయిన్స్‌ అగ్రతారలుగానే కొనసాగాలంటే.. అదృష్టం వారి వెంటే వుండాలి. ఒకప్పటి అగ్రహీరోయిన్లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పరిమితమవుతుంటారు. అయితే ఇక్కడ హీరోయిన్‌గా నటించిన ఓ నటీమణి డ

హీరోయిన్స్‌ అగ్రతారలుగానే కొనసాగాలంటే.. అదృష్టం వారి వెంటే వుండాలి. ఒకప్పటి అగ్రహీరోయిన్లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పరిమితమవుతుంటారు. అయితే ఇక్కడ హీరోయిన్‌గా నటించిన ఓ నటీమణి డబ్బింగ్ ఆర్టిస్టుగా మారింది. 
 
ఆమె ఎవరంటే..? ఇడియట్ సినిమాతో రవితేజ సరసన నటించిన రక్షిత. ఇడియట్ సినిమాలో రవితేజతో అదరగొట్టిన రక్షిత.. ఆ తర్వాత నాగార్జునతో శివమణి చిత్రంతో మరో హిట్ అందుకుంది. ఆపై మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు సరసన నటించింది. 
 
కానీ ఆ చిత్రాలు పెద్దగా హిట్ కాకపోవడంతో రక్షిత కెరీర్ గాడి తప్పింది. అవకాశాలు ఆశించినంతగా రాలేదు. ఈ క్రమంలో రక్షిత దర్శకుడు ప్రేమ్‌తో ప్రేమలో పడింది. కొంతకాలానికే వీరి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో రక్షిత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిచారు. 
 
కానీ ఆర్టిస్టుగా కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. భర్త ప్రేమ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న  'విలన్‌' సినిమాలో అమీ జాక్సన్‌ పాత్రకు రక్షిత డబ్బింగ్‌ చెప్తోంది. ఈ సినిమా హిట్ అయితే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను డబ్బింగ్ తోనే కొనసాగించాలని రక్షిత అనుకుంటోందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.