ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (21:03 IST)

సంగీత ఎంత మారిపోయిందో!

ఒక‌ప్పుడు యూత్‌ను అల‌రించిన సంగీత ప్ర‌స్తుతం త‌ల్లి పాత్ర‌ల‌ను పోషిస్తోంది. తాజాగా ఆమె న‌టిస్తున్న చిత్రం మ‌సూద‌.. ప‌దిహేడు సంవ‌త్స‌రాల త‌న కూతురు అనూహ్యంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టంతో ఆందోళ‌న చెందిన ఒక ఒంట‌రి త‌ల్లి అతి భ‌య‌స్తుడైన ప‌క్కింటి యువ‌కుడి స‌హాయంతో కూతుర్ని ఎలా కాపాడుకుంద‌నేది పాయింట్ తోరూపొందుతోంది. ఇందులో సంగీత స్టిల్‌ను రిలీజ్ చేశారు.
 
'మ‌ళ్లీ రావా', 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ' లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన రెండు క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఫిలిమ్స్‌ను అందించిన స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నుంచి మూడో చిత్రం రాబోతోంది. దీనికి 'మ‌సూద‌' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. 'మ‌ళ్లీ రావా' చిత్రంతో గౌత‌మ్ తిన్న‌నూరి, 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ' చిత్రంతో స్వ‌రూప్‌ ఆర్‌.ఎస్‌.జె. లాంటి ఇద్ద‌రు ప్ర‌తిభావంతులైన‌ డైరెక్ట‌ర్లను ప‌రిచ‌యం చేసిన స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఇప్పుడు 'మ‌సూద‌' మూవీతో మ‌రో ప్రామిసింగ్ డైరెక్ట‌ర్ సాయికిర‌ణ్‌ను ప‌రిచ‌యం చేస్తోంది.
 
హార‌ర్ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో హీరోగా 'జార్జిరెడ్డి' ఫేమ్ తిరువీర్ (ల‌ల్ల‌న్ సింగ్ పాత్ర‌ధారి) న‌టిస్తుండ‌గా, 'గంగోత్రి'లో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సంగీత అత్యంత ముఖ్య‌మైన పాత్ర‌ను చేస్తున్నారు.
 
'మ‌సూద' అనే టైటిల్ ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంటే, పోస్ట‌ర్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ఆర్‌. విహారి సంగీత ద‌ర్శ‌కునిగా, న‌గేష్ బానెల్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.
 
తారాగ‌ణం:
సంగీత‌, తిరువీర్‌, కావ్య క‌ల్యాణ్‌రామ్‌
సాంకేతిక బృందం:
స్టోరీ, డైరెక్ష‌న్‌: సాయికిర‌ణ్‌
ప్రొడ్యూస‌ర్‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా
సినిమాటోగ్ర‌ఫీ: న‌గేష్ బానెల్‌
మ్యూజిక్‌: ప్ర‌శాంత్ ఆర్‌. విహారి
ఆర్ట్: క్రాంతి ప్రియ‌మ్