సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (12:55 IST)

డబ్బు నష్టపోయా.. అందుకే ఈ పని చేశా : సంజయ్ గల్రానీ

తాను పెట్టిన పెట్టుబడి మొత్తం పోయి నష్టాల్లో కూరుకునిపోయానని, అందుకే ఇంత పెద్ద తప్పు చేయాల్సి వచ్చిందని కన్నడ నటి సంజయ్ గల్రానీ చెప్పుకొచ్చారు. కన్నడ చిత్ర సీమలో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో సంజయ్ గల్రానీత పాటు.. మరో హీరోయిన్ రాణిగి ద్వివేది కూడా అరెస్టు అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం వీరిద్దరూ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్నారు. 
 
అయితే, సంజయ్ గల్రానీ డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి గల కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గతంలో వెలుగు చూసిన ఐఎంఏ స్కామ్‌లో నిండా మునిగిపోయిందట. తాను ఎంతో పెట్టుబడి పెట్టి నష్టపోయానని అధికారుల విచారణలో పేర్కొన్న ఆమె, తనకు జరిగిన నష్టాన్ని ఎవరు తీరుస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం సంజనతో పాటు, రాగిణిద్వివేదిని కూడా కస్టడీలోకి తీసుకుని వారి ఇతర ఆస్తులు, పెట్టుబడులపై సీసీబీ, ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ స్కామ్ లో తాను ఎలా నష్టపోయానన్న విషయాన్ని సంజన వివరించింది.
 
ఐఎంఏ, దాని అనుబంధ కంపెనీలు, అధిక రాబడి ఆశ చూపుతూ కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించి, మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా నష్ట పరిచాయి. తాను కూడా మంచి రిటర్నులు అందుకోవాలని భావిస్తూ, లక్షలు వెచ్చించి మోసపోయానని వెల్లడించింది. 
 
వీరిద్దరూ ఏవైనా హవాలా డీల్స్ జరిపించారా? అన్న విషయాన్ని విచారిస్తుంటే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తరువాతనే తాను డ్రగ్స్ దందాలోకి దిగానని కూడా సంజన చెప్పినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. కాగా, వీరిద్దరి బెయిల్ పిటిషన్లను ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చగా, హైకోర్టును ఆశ్రయించాలని వారు భావిస్తున్నారు.