శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:59 IST)

అది 3, 4 పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లకా పీకే... ప‌వ‌న్ పైన శ్రీరెడ్డి సెన్సేష‌న‌ల్ కామెంట్స్

టాలీవుడ్ సెన్సేష‌న్ నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇంత‌కీ శ్రీరెడ్డి ఏమ‌న్న‌దంటే... "గూండాగిరి చేస్తే స్పెషల్ స్

టాలీవుడ్ సెన్సేష‌న్ నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇంత‌కీ శ్రీరెడ్డి ఏమ‌న్న‌దంటే... "గూండాగిరి చేస్తే స్పెషల్ స్టాటస్ రాదు పీకే... ప్రాస్టిట్యూషన్‌ను లీగలైజ్డ్ చేయాలని అడుగుతున్న‌ది వాకాడ అప్పారావు కోసమా? 3, 4 పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లకా?" అని ఓ పోస్టులో ప్రశ్నించిన శ్రీరెడ్డి, "ఏదో పొలిటికల్ అజెండాతో (చంద్రబాబు నాయుడి దీక్ష నుంచి చూపు మరల్చేందుకు) అమ్మ పేరుతో నిన్న మా అసోసియేషన్‌కు వచ్చిన నువ్వు, ఫుల్ నెగటివ్ మార్కులు వేయించుకుని వెళ్లావు.
 
మీ అమ్మకు నువ్విచ్చిన విలువ కన్నా నేను ఎక్కువ విలువ ఇస్తాను. మా మహిళా సంఘానికి ఆవిడ పేరే పెడుతున్నాను. జిందాబాద్ అంజనా దేవీ" మరో పోస్టు పెట్టింది. ఇక 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' అని పవన్ పెట్టిన పోస్టుపై స్పందిస్తూ, "కొత్త సినిమా... 'రాళ్లేసి కొట్టుకుందాం రా'... 'తిక్కకి లెక్క లేదు' ఈ పేరు కూడా బాగుంటుంది" అని వ్యాఖ్యానించింది. 
 
తను ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబుకు మద్దతిస్తానని, అయితే ఏంటి..? అంటూ ప్రశ్నించింది. "నువ్వు చితక్కొట్టించింది మీడియా వాళ్ల కార్లను కాదు. జర్నలిస్టుల మనోభావాలని... కాస్కో నా వాస్కోడిగామా" అని మరో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. ఇలా... శ్రీరెడ్డి ట్వీట్స్ చేయ‌డం చూస్తుంటే... తెర వెన‌క ఏదో జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. మ‌రి... ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో..?