సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (14:33 IST)

మరోమారు పెళ్లి మాటెత్తారో.. ఖబడ్దార్ అంటున్న హీరోయిన్!

కోలీవుడ్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్. డేరింగ్, డాషింగ్ హీరోయిన్. హీరో విశాల్‌తో ప్రేమలో మునిగితేలింది. ఆ తర్వాత ఈ ప్రేమ విఫలం కావడంతో సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా ఉంది. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, హీరోయిన్, క్యారెక్టర్ పాత్రలో రాణిస్తోంది. 
 
ఈ క్రమంలో ఆమె తాజాగా తన 36వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనాథ పిల్లల సమక్షంలో జరుపుకుంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన పుట్టినరోజు వేడుకలను అనాథల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా వుందని చెప్పింది. 
 
ఆ సందర్భంలో  విలేకరులు పెళ్లిప్రస్తావన తెచ్చినప్పుడు ఆమె మండిపడింది. పొద్దస్తమానం పెళ్ళి ప్రస్తావన ఎందుకు తెస్తారు? మహిళగా జన్మించినవారు పెళ్ళి చేసుకోవాలన్న షరతు ఏదైనా ఉందా? అని ప్రశ్నించింది. ఇలాంటి ప్రశ్నలు మినహా.. మీకు మరో ప్రశ్న దొరకదా! అంటూ వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది.