బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (17:16 IST)

ఆది పురుష్ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అక్టోబర్ 2న టీజర్.. కానీ?

Adipurush
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మొదటి మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. రామాయణంలోని మనకి తెలియని కోణాన్ని ఇందులో చూపించబోతున్నారు. రాముడు అలియాస్ రఘురాం పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. సీతాదేవి అలియాస్ జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. 
 
ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళ దాటినా, ఆ చిత్రానికి సంబంధించి ప్రభాస్ పార్ట్ కంప్లీట్ అయినా ..ప్రభాస్ లుక్‌కు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. అయితే అక్టోబర్ 2న టీజర్ రిలీజ్ అవుతుంది అనే ప్రచారం మొదలవ్వగానే ప్రభాస్ అభిమానుల్లో కొంత ఉత్సాహం నెలకొంది.
 
కానీ ప్రస్తుతం ఓ షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. అదేంటి అంటే ఆదిపురుష్ టీజర్‌లో ప్రభాస్ ఫేస్ రివీల్ చేయరని ప్రచారం జరుగుతుంది. అది కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదనే చెప్పాలి.