Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శివానీ అరంగేట్రం ఖరారైంది.. అడవిశేష్‌తో రొమాన్స్..

మంగళవారం, 23 జనవరి 2018 (16:28 IST)

Widgets Magazine

గరుడ వేగ నటుడు, యాంగ్రీమెన్ డాక్టర్ రాజశేఖర్‌, నటి జీవిత దంపతుల కుమార్తె శివాని తెరంగేట్రం చేయనుంది. కొద్ది రోజులుగా శివాని నటించనుందని వినిపిస్తోంది. ప్రస్తుతం అది నిజం కానుంది. తల్లితండ్రులు ఇద్దరూ నటులే కావడంతో కుమార్తెను హీరోయిన్‌గా వెండితెరపై తెచ్చేందుకు  ప్రోత్సహిస్తున్నారు.
 
ఇప్పటికే శివాని మెడిసిన్‌ చదువుతోంది. డాన్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇప్పటికే శిక్షణ తీసుకుంది. ఇటీవల అమ్మడి ఫోటో షూట్ ఇమేజ్‌లు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా బాలీవుడ్‌లో అలియా భ‌ట్‌ నటించిన ''2 స్టేట్స్‌'' సినిమా తెలుగు రీమేక్‌తో శివానీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. అడ‌వి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ  సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవర్ స్టార్‌కు టాలీవుడ్ హీరో సపోర్ట్...

రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ...

news

పద్మావత్‌కు బ్రేక్ వేయలేం : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావత్‌'కు బ్రేకులు వేయలేమని సుప్రీంకోర్టు తేల్చి ...

news

ఆందోళనకారులను చిత‌క్కొడుతున్న‌ రాంగోపాల్ వర్మ (వీడియో)

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఆందోళనకారులను చితక్కొట్టారు. తన స్టంట్స్‌తో అందర్నీ ...

news

''సుచీలీక్స్'' వచ్చేస్తున్నా.. ఎలా వెళ్లానో అలాగే తిరిగొచ్చా: సుచిత్ర

''సుచీలీక్స్'' అంటేనే సినిమా వారికి భయం. వామ్మో అంటూ జడుసుకుంటూ పారిపోతారు. ఎందుకంటే ...

Widgets Magazine