1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 2 సెప్టెంబరు 2015 (19:27 IST)

బయట కూడా అలానే బిహేవ్ చేస్తున్న భామలు... టాక్ ఆఫ్ టాలీవుడ్

గ్లామర్‌ ఫీల్డులో తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి రకరకాలుగా హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పుడు శృంగారం గురించి మాట్లాడేందుకు భయపడేవారు. కానీ నేడు అది బహిరంగమైంది. ఎంత బాగా మాట్లాడితే అంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. బాలీవుడ్‌లో ఇలాంటి విషయాలు మామూలే. ఉదాహరణకు నటి రాఖీ సావంత్‌ విషయం తీసుకోండి. గతంలో ఓ సందర్భంలో పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 
 
ఆమె తన కాలిగోటికి సరిరాదని చెబుతూ.. ఇలాంటివాళ్ళను దేశం నుంచి తరిమేయాలని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తాజాగా మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. నిద్రపోయేముందు ఎటువంటి దుస్తులు ధరిస్తారని రాఖీని అడిగితే.. నాకసలు బట్టలు వేసుకోవడం ఇష్టం వుండదంటూ కొంటెగా సమాధానమిచ్చింది. ఇది యూత్‌లో పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో రావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. 
 
ఇదిలావుండగా, తెలుగులో ఎఫైర్‌ అనే చిత్రం రూపొందుతోంది. ఈ కథ ఇద్దరు లెస్బియన్స్‌ స్టోరీ. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలా వుంటుందనేది కాన్సెప్ట్‌. ప్రశాంతి, గీతాంజలి ప్రేమికులు. సినిమాల్లో వీరిద్దరూ ప్రేమించుకునే సీన్స్‌ కైపెక్కించేవిగా వున్నాయి. అది సినిమా కనుక.. స్టిల్స్‌ పబ్లిసిటీ కోసం అనుకోవచ్చు. కానీ బయట కూడా వారు అలాగే బిహేవ్‌ చేస్తారట. 
 
ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం రాత్రి ప్రసాద్‌ ల్యాబ్‌లో ఓ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు ఫొటోగ్రాఫర్లకు కనువిందుగా ఫోటోలు ఇచ్చారు. ఫొటోలకు ఫీల్‌ కల్గించే విధంగా స్టిల్‌ ఇవ్వమంటే.. రకరకాలుగా ఫోజులు ఇచ్చారు. ఆ స్టిల్స్‌ కూడా కైపెక్కించేవిగా వున్నాయి. అయితే వీర్దిద్దరూ బయట కూడా మంచి ఫ్రెండ్స్‌ అట. అందుకే మా మధ్య వచ్చే సీన్స్‌లో రియలస్టిక్‌గా వుంటాయని చెప్పడం విశేషం.