గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (15:14 IST)

మాధవన్‌కు కరోనా పాజిటివ్.. అమీర్ ఖాన్‌ ఫోటోను షేర్ చేసి.. ఆల్ ఈజ్ వెల్

Amir Khan_Madhavan
బాలీవుడ్ సినీ ప్రముఖులపై కరోనా పంజా విసురుతోంది. షూటింగ్‌లకు వెళ్తోన్న నటీనటుల్లో ఒక్కొక్కరు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు మాధవన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాదు ఇటీవలే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కి కూడా కరోనా సోకగా.. అతడితో ఉన్న 3 ఇడియట్స్ ఫొటోను షేర్ చేసిన మాధవన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు.
 
"రాంచో(3 ఇడియట్స్‌లో ఆమిర్ పాత్ర పేరు)ను ఫర్హాన్(3 ఇడియట్స్‌లో మాధవ్ పేరు) ఫాలో అవుతుంటే.. వైరస్(3 ఇడియట్స్‌లో బొమన్ ఇరానీ) మా ఇద్దరి వెంట పడేవాడు. అయితే ఈసారి వాడికి (కరోనా వైరస్‌కు) మేము చిక్కాము. ఆల్ ఈజ్ వెల్. కరోనా వైరస్‌కి కూడా త్వరలో చెక్ పడుతుంది. ఈ ఒక్క స్థానంలోకి మాతో పాటు రాజు రాకూడదని అనుకుంటున్నాము. అందరికీ థ్యాంక్స్. నా ఆరోగ్యం బావుంది" అని కామెంట్ పెట్టారు.
 
కాగా ఆమిర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బుధవారం ఆయన అధికారిక ప్రతినిధి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, హోం క్వారంటైన్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఆమిర్‌ను కలిసిన వారు పరీక్షలు చేయించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార ప్రతినిధి వెల్లడించారు.