శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (14:18 IST)

యంగ్ డైరెక్టర్లతో మెగాస్టార్ చిరంజీవి... తాజాగా అనిల్ రావిపూడికి ఛాన్స్

chiranjeevi style
మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్లతో చిత్రాలు నిర్మించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే తమిళ చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ వంటివారు కుర్ర దర్శకులతో పని చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఈ ఫార్ములాను మెగాస్టార్ చిరంజీవి కూడా ఫాలో అవుతున్నారు. 
 
ఇందులోభాగంగా, చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టులను శ్రీవశిష్ట దర్శకత్వంలోనూ, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ నటించనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పని చేసేందుకు ఆయన పచ్చజెండా ఊపారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. బాలయ్య హీరోగా భగవంత్ కేసరి అనే పేరుతో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.