ఆ హీరోయిన్‌కు జక్కన్న మల్టీస్టారర్‌లో ఛాన్స్.. ఆ కథానాయిక ఎవరు?

మెగాస్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బాహుబలి మేకర్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ గురించి అనేక

selvi| Last Updated: మంగళవారం, 15 మే 2018 (15:32 IST)
మెగాస్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బాహుబలి మేకర్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా హీరోయిన్ విషయంలో ఓ వార్త షికార్ చేస్తోంది.
 
ఇటీవల మహానటి చిత్రంలో సావిత్రిగా అందరిని అబ్బురపరిచిన కీర్తి సురేష్ రాజమౌళి సినిమాలో నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మహానటి చిత్రంలో ఇప్పటికే కీర్తి నటనను కొనియాడిన రాజమౌళి.. ఆమెకు తన సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజమౌళి ప్రస్తుతం సినీ నటుల ఎంపిక విషయంలో బిజీగా వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే.. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటనకు రాజమౌళి ఫిదా అయ్యారు. తాజాగా సమాచారం మేరకు కీర్తి సురేష్‌ని రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :