శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (17:19 IST)

సినిమా చూశాక అందరిలో పరిణితి వస్తుంది- సుధీర్‌బాబు

Sudheer Babu, Mohanakrishna Indraganti, Kritishetti, Sahi Suresh and others
Sudheer Babu, Mohanakrishna Indraganti, Kritishetti, Sahi Suresh and others
నెట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.  సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి నటించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో  సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
 
సుధీర్ బాబు మాట్లాడుతూ..'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లాంటి గొప్ప సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. సినిమా చూసిన తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తండ్రి కూతుళ్ళు కలసి సినిమాకి వెళ్తే చాలా ఆనందిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పరిణితి వస్తుంది. ఈ సినిమాకి మరిన్ని ప్రశంసలు వస్తాయని బలంగా నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా మీడియా మరింత సపోర్ట్ చేయాలి. ఇంద్రగంటి గారితో పని చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంది. ఈ సినిమా చూసిన తర్వాత కృతిశెట్టి నా ఫేవరేట్ స్టార్ అయ్యారు. మా నిర్మాతలు గర్వంగ చెప్పుకునే సినిమా నిర్మించారు. వారికి ఆల్ ది బెస్ట్. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు తీయాలి. పీజీ విందా, సాహి సురేష్, మార్తాండ్ కే వెంకటేష్, వివేక్ సాగర్ తో పని చేయడం ఆనందంగా వుంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అందరూ తప్పక చూడాల్సిన వర్త్ వాచింగ్ మూవీ'' అన్నారు
 
కృతిశెట్టి మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నాకు మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో నన్ను తీసుకున్నందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇప్పటి వరకూ నా బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని ప్రేక్షకులు అంటున్నారు. చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. సుధీర్ బాబు గారు లాంటి మంచి యాక్టర్ తో నటించడం ఆనందంగా వుంది.  ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి'' అని కోరారు.
 
మోహనకృష్ణ ఇంద్రగంటి.. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'కి హార్ట్ వార్మింగ్ సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు ఒక కొత్త కోణాన్ని ప్రజంట్ చేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవ్వాలనే కోరిక వుంది. యంగ్ స్టర్స్, ఫ్యామిలీని ద్రుష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. యంగ్ స్టర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరింత ఎక్కువ మంది ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. సుధీర్ బాబు కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని సినిమా చుసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.  మేము నమ్మిన అంశాలపై పట్ల విమర్శకులు కూడా ఏకీభవించడం మాకు ఆనందం కలిగించింది. కృతిశెట్టి చాలా కొత్తగా కనిపిస్తున్నారనే ప్రశంసలు వస్తున్నాయి. పీజీ విందా, సాహి సురేష్, వివేక్ సాగర్ ఇలా సాంకేతిక నిపుణులందరి వర్క్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మాకు సహకరించిన మీడియాకి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్‌ కృతజ్ఞతలు. గొప్ప ఆత్మగౌరవంతో అరంగేట్రం చేసిన బెంచ్ మార్క్ స్టూడియోకి అభినందనలు. ఈ మంచి సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రేక్షకులు, మీడియాని కోరుతున్నాను''
 
సాహి సురేష్ మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వైబ్ తో ముందుకు వెళుతుంది. సుధీర్ బాబు, ఇంద్రగంటి, కృతిశెట్టి , సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు.
 
శ్రీనివాస్ వడ్లమాని మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారు  మలయమారుతం లాంటి సినిమా తీశారు. ఈ సినిమాని విజయవంతం చేయాల్సిన భాద్యత మనం తీసుకోవాలి. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలి'' అని కోరారు.