Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కత్తి మహేష్ రిపోర్ట్... ''అజ్ఞాతవాసి'' చెత్త సినిమా.. చికాకు పెట్టారు...

బుధవారం, 10 జనవరి 2018 (11:57 IST)

Widgets Magazine
Agnyaathavaasi

అజ్ఞాతవాసి ''చెత్త సినిమా'' అనేశాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే, ఆయన ఫ్యాన్స్ అంటేనే అంతంతకుపైకి లేచే కత్తి.. జనవరి 10న (నేడు) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి సినిమాను థియేటర్లో చూశారు. ఇక సినిమా గురించి ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' ఓ చెత్త సినిమా అంటూ కత్తి పోస్ట్ చేశాడు. 
 
రివ్యూల పరంగా అజ్ఞాతవాసికి పాజిటివ్ టాకొచ్చిన నేపథ్యంలో.. సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  కానీ కత్తి మహేష్ మాత్రం ఈ సినిమాపై విశ్లేషణ ఇచ్చాడు. సీరియస్‌గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని కత్తి ట్వీట్ చేశాడు. 
 
సినిమాను అజ్ఞాతవాసి అపహాస్యం చేసిందని విమర్శలు గుప్పించారు. పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా దారుణంగా వుందని.. 'రిస్క్ చేసి చూస్తే... టైమేమో... మీ ఇష్టం' (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్‌లో ఉంది) అంటూ కామెంట్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ కాసేపు అలా మెరుస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. ఈ సినిమాలో వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో ఓ నాలుగు నిమిషాల పాటు కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. తీరా అజ్ఞాతవాసి విడుదలయ్యాక చూస్తే వెంకీ సీన్ లేదు. కానీ వెంకీ సీన్‌ను త్వరలో అజ్ఞాతవాసిలో జోడిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ అజ్ఞాతవాసి మానియా మామూలుగా లేదుగా? చూడండి ఈ ఊరేగింపు(video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మానియా మామూలుగా లేదు. పవన్ అభిమానుల కోలాహలం ...

news

గీతా ఆర్ట్స్‌తో అర్జున్ రెడ్డి సినిమా.. సాదాసీదా హారర్ థ్రిల్లర్ కాదు..

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఓ ...

news

'అజ్ఞాతవాసి' అన్నంత పనీ చేశాడు... ఏ చేశాడంటే?

పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం కోసం యువతే కాదు మహిళలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ...

news

''అజ్ఞాతవాసి" ఆ సినిమాకు కాపీనే.. తేల్చేసిన ఫ్రెంచ్ డైరక్టర్

త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా ''అజ్ఞాతవాసి'' సినిమా కాపీ అని ఆరోపణలు ...

Widgets Magazine