శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Vasu
Last Modified: బుధవారం, 10 జనవరి 2018 (12:07 IST)

'కోటేశ్వర రావు'లు హర్ట్ అవుతున్నారు... పవన్ సారీ చెప్పేస్తాడేమోలే...

ఇల్లు కాలి ఒకడేడుస్తోంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట వెనకటికొకడు.. అలా ఉంది.. కోటేశ్వరరావుగారి పరిస్థితి... టి సిరీస్‌తో కాపీరైట్ సమస్యలు.. థియేటర్లకు ఫ్యాన్స్ ‌షోల అనుమతులతో సినిమా బృందం తలమునకలవుతూంటే... ‌జనాలలో పబ్లిసిటీ కోసం లాయర్ కోటేశ్వరర

ఇల్లు కాలి ఒకడేడుస్తోంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట వెనకటికొకడు.. అలా ఉంది.. కోటేశ్వరరావుగారి పరిస్థితి... టి సిరీస్‌తో కాపీరైట్ సమస్యలు.. థియేటర్లకు ఫ్యాన్స్ ‌షోల అనుమతులతో సినిమా బృందం తలమునకలవుతూంటే... ‌జనాలలో పబ్లిసిటీ కోసం లాయర్ కోటేశ్వరరావు లాంటి వారి చర్యలు రామాయణంలో పిడకలవేట అని కొందరు అనుకుంటున్నారు.
 
ఇప్పటివరకు ఎంతోమంది పేర్లను వాడుతూ జానపదాలు, సినిమాలు వచ్చినా ఎవ్వరూ ఇంతగా స్పందించలేదనేది నిర్వివాదాంశం. స్వతహాగా లాయర్ కాబట్టి పనిలో పనిగా కోర్ట్ లావాదేవీలు వంటి వాటిలో అనుభవంతో పాటు, పబ్లిసిటీ కూడా కలిసి వస్తోందనే ఆలోచనతోనే సదరు కోటేశ్వరరావు ఇలా చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
అప్పుడెప్పుడో... పోలీసోడిపెళ్లాం సినిమా గురించి పోలీసుల భార్యలు బాధపడి రోడ్డెక్కి ఆ పేరును కాస్త పోలీస్ భార్యగా మార్చుకున్నారంటే అర్థముంది కానీ మరీ కోటేశ్వరరావుగారిలా బాధపడిపోతే.. దారుణమనిపిస్తోందని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కోటేశ్వరరావులు హర్ట్ అయితే పవన్ కళ్యాణ్ సారీ చెప్పేస్తాడేమోలే అనే మాట కూడా వినబడుతోంది. మరి సక్సెస్ మీట్లో ఆ మాట చెప్తారేమో? ఇకపోతే పవన్ కళ్యాణ్ మానియా చూడండి ఇక్కడ...