మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (17:13 IST)

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

Dev Gill, Aarti
Dev Gill, Aarti
బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు,  ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి 'అహో! విక్రమార్క' అనే మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
 
Aho vikramarka team
Aho vikramarka team
దేవ్‌గిల్ మాట్లాడుతూ.. ‘మగధీర నుంచి నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. పూణెలో మా తల్లిదండ్రులు జన్మనిచ్చి ఉండొచ్చు.. కానీ హైద్రాబాద్‌లో రాజమౌళి గారు నాకు పేరు ఇచ్చారు. రమా గారు నాకు తల్లిలా సపోర్ట్ ఇచ్చారు. వారి వల్లే ఈ రోజు ‘అహో విక్రమార్క’ అనే చిత్రాన్ని నిర్మించగలిగాను. 12, 13 ఏళ్ల క్రితం రాజమౌళి గారు నన్ను ముంబై నుంచి పట్టుకొచ్చి నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నేను హీరోగా సినిమాను తీశాను. నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నన్ను ఇంత వరకు విలన్‌గా చూశారు. నా మీద ప్రేమను కురిపించారు. కానీ ఈ సినిమాతో మీ అందరికీ సర్ ప్రైజ్ ఇవ్వబోతోన్నాను. త్రికోటి గారికి చాలా పెద్ద విజన్ ఉంది. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. త్వరలోనే పాటలు కూడా రిలీజ్ చేస్తాం. మా సినిమా మీద ఆడియెన్స్ ప్రేమను కురిపించి, ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
యువరాజ్ మాట్లాడుతూ.. ‘నేను ప్రొడక్షన్ టీంలో పని చేశాను.తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. దేవ్ గిల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఓ ఆర్టిస్ట్‌గా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. తెలుగు ప్రజలంతా ఈ సినిమాను ఆధరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
దేవ్‌గిల్ భార్య, నిర్మాత ఆర్తి మాట్లాడుతూ.. ‘మా కల నెరవేరబోతోంది. ఇదే మాకు మొదటి చిత్రం. మా ప్రొడక్షన్ నుంచి మొదటి చిత్రం రాబోతోంది. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటి వరకు మా మీద ఎంతో ప్రేమను కురిపిస్తూ వచ్చారు. ఈ చిత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. టెక్నికల్‌గా ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. అందరూ మా సినిమాను ఆదరించండి’ అని అన్నారు.
 
దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ.. ‘మగధీర నుంచి దేవ్‌గిల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచీ టచ్‌లోనే ఉన్నాం. హీరోగా ఓ సినిమా చేద్దామని ఆయన చెబుతూనే ఉండేవారు. ఆయనకు ఎలాంటి కథ అయితే బాగుంటుందా? అని ఆలోచించాను. పోలీస్ కథ అయితే బాగుంటుందని అనుకుని ప్రాజెక్ట్ అలా స్టార్ట్ చేశాం. తెలుగు, హిందీ భాషల్లో షూటింగ్‌ను చేశాం. మంచి సినిమా చేశాం. ఆడియెన్స్ మా సినిమాను చూసి ఆదరించాలి’ అని అన్నారు.
 
ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘నేను మారాఠీ చిత్ర సీమలో పని చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాలో సౌత్ ఇండియా పరిశ్రమ, టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతీ ఒక్క నటుడు ఇక్కడ పని చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మా ఆర్టిస్టులు మహేష్ మంజ్రేకర్, షాయాజీ షిండే వంటి వారున్నారు. విలన్‌గా ఈ చిత్రంలో నన్ను తీసుకున్నారు. మొదటి సారిగా నేను సౌత్‌కి వస్తున్నాను. పదేళ్ల క్రితమే నా ఆఫీస్‌లో రాజమౌళీ భారీ చిత్ర పటాన్ని ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఆయన టీంతోనే పని చేస్తున్నాను. నాకెంతో ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆధరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
నటి చిత్రా శుక్లా మాట్లాడుతూ.. ‘పెళ్లికి ముందు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. పెళ్లి అయిన తరువాత రాబోతోన్న మొదటి చిత్రమిదే. ఈ కథను నెరేట్ చేసేందుకు ఆఫీస్‌కు పిలిచారు. ఆ ఆఫీస్‌లోకి అడుగు పెట్టడంతోనే రాజమౌళి గారి ఫోటో కనిపించింది. ఎంతో పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది. ఈ చిత్రంలో ఎంతో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనం