శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (15:07 IST)

అర్జున్ దాస్ ప్రేమలో ఐశ్వర్యలక్ష్మి?

aishwara - arjundoss
కోలీవుడ్ నటి ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో పడినట్టు వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఆ నటుడు పేరు అర్జున్ దాస్. 'ఖైదీ' చిత్రంలో తన అద్భుత నటనతో శభాష్ అనిపించుకున్న అర్జున్ దాస్.. ఆ తర్వాత 'మాస్టర్' చిత్రంలో నటించారు. అలాంటి అర్జున్ దాస్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
దీనికి కారణం అర్జున్ దాస్‌తో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను ఆమె తాజాగా రిలీజ్ చేశారు. అయితే, నిజంగానే వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందా లేదా స్నేహమా అనేది తెలియాల్సి వుంది. కాగా, అర్జున్ దాస్ 'ఖైదీ', 'మాస్టర్' చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. 
 
అలాగే, ఐశ్వర్య లక్ష్మికికూడా గత యేడాది బాగా కలిసి వచ్చింది. 2022 యేడాది ఆఖరులో వచ్చిన మట్టికుస్తీ చిత్రంతో పాటు అంతకుముందు వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్',' గార్గీ' వంటి అనేక చిత్రాలు ఆమెకు మంచి పేరుతో పాటు ప్రశంసల వర్షం కూడా కురిపించాయి.