శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (11:33 IST)

'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ఐశ్వర్య లుక్ స్టన్నింగ్‌గా ఉంది : అభిషేక్ బచ్చన్

'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ఐశ్వర్యారాయ్ అందాలను ఆరబోయడంపై ఆమె భర్త అభిషేక్ బచ్చన్ స్పందించాడు. 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ఐశ్వర్య లుక్ స్టన్నింగ్‌గా ఉందని, నేను ప్రస్తుతం బిజీగా ఉన్నానని అందుక

'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ఐశ్వర్యారాయ్ అందాలను ఆరబోయడంపై ఆమె భర్త అభిషేక్ బచ్చన్ స్పందించాడు. 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ఐశ్వర్య లుక్ స్టన్నింగ్‌గా ఉందని, నేను ప్రస్తుతం బిజీగా ఉన్నానని అందుకే సినిమా చూడలేదని అంటున్నాడు. భార్య వెండితెరపై అందాలను ఆరబోస్తూ, రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటే లుక్ స్టన్నింగ్‌గా ఉందంటూ కామెంట్ చేయడం విడ్డూరమే మరి. 
 
కాగా, ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్యా రాయ్ రెచ్చిపోయిన తీరుకి అందరూ ముక్కున వేలేసుకున్నారు. పెళ్లి అయి ఒక బిడ్డకు తల్లిగా ఉన్న ఐశ్వర్యా... అందాలను అరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాల్లో కూడా నటిస్తుండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఐశ్వర్య వ్యవహారశైలి పట్ల బచ్చన్ కుటుంబం ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భర్త అభిషేక్ బచ్చన్‌ పైవిధంగా స్పందించడం గమనార్హం.