శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (14:04 IST)

ఫుట్‌బాల్ క్రీడాకారుడు భార్యగా 'మహానటి'

సాధారణంగా మామూలు అమ్మాయిలే వయస్సు చెప్పుకోవడానికి ఇష్టపడరు. మరి గ్లామర్ ఫీల్డ్ సినిమా పరిశ్రమలో ఉండే హీరోయిన్‌లైతే... అసలు ఆ ఛాయలు కూడా కనపడనివ్వరు. అయితే, మహానటి సావిత్రి సినిమాతో సంచలనం సృష్టించిన దక్షిణాది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ విషయంలో కూడా వినూత్నంగానే ముందడుగు వేశారు.
 
ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందనున్న ఒక సినిమాలో ఆమె కథానాయికగా నటించనుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రని పోషిస్తుండగా కీర్తి అతనికి భార్యగా నటించనుంది. 
 
కథ ప్రకారం సినిమాలో కీర్తి సురేష్ 30 ఏళ్ల స్త్రీ పాత్రలో కనిపించనుందట. ఇందుకోసం టీమ్ ఆమెకు ప్రత్యేకమైన మేకప్ వేయనున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నాడు. హిందీ భాష బాగా వచ్చి ఉండటంతో ఈ చిత్రంలో నటించడానికి తనకి ఎలాంటి ఇబ్బందులూ లేవంటున్న కీర్తి మరి ఈ కొత్త లుక్‌లో ఎలా ఉంటారో చూద్దాం.