శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 25 మార్చి 2017 (16:21 IST)

పవన్ 'కాటమరాయుడు'తో అజిత్ ఫ్యాన్స్ ఖుషీ... ఉత్తరాది అహంకారం-దక్షిణాది గౌరవం పనిచేస్తుందా?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు తమిళంలో హీరో అజిత్ నటించిన వీరంకు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే పవన్ క్రేజ్ వుంటుంది కాబట్టి సినిమా ఆడుతుంది. కానీ పొరు

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు తమిళంలో హీరో అజిత్ నటించిన వీరంకు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే పవన్ క్రేజ్ వుంటుంది కాబట్టి సినిమా ఆడుతుంది. కానీ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలో అలాంటి పరిస్థితి వుండదు.
 
ఐతే తమిళనాడులో రికార్డు స్థాయిలో పవన్ చిత్రం విడుదలవడంపై అక్కడి హీరోలు బెంబేలెత్తిపోతున్నారు. సహజంగా శుక్రవారం నాడు తమిళనాడులో కూడా పలువురి హీరోల చిత్రాలు విడుదలవుతాయి. ఐతే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం ఇక్కడి హీరోలకు పోటీఇస్తోంది. ఈ చిత్రం ఏకంగా 180 స్క్రీన్లలో విడుదలవడంపై తమిళ సినీజనం ఆశ్చర్యంతో చూస్తున్నారు. పవన్ క్రేజ్ తమిళనాడుకు కూడా పాకిందా అని నోరెళ్లబెడుతున్నారు. ఎలాగైతే తెలుగులోకి సూర్య, కార్తి చిత్రాలు దూసుకు వస్తున్నాయో అలాగే పవన్ కళ్యాణ్ చిత్రాలు కూడా ఇక్కడ ఆడుతున్నాయని అంటున్నారు. 
 
ఇకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అదేంటయా అంటే పవన్ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను అజిత్ ఫ్యాన్స్ ప్రదర్శించడం. తమ హీరో అజిత్ చిత్రాన్ని రీమేక్ చేసుకుని నటించినందుకు, అజిత్ పైన ఎలాంటి అభిమానం చూపారో అలాగే పవన్ పైన కూడా చూపిస్తున్నారు. కాటమరాయుడు పోస్టర్లను ఆటోలపై అంటించారు. ఆ ఆటోలు చెన్నై నగరంలో రయ్యమని కాటమరాయుడు హంగామా చూపిస్తున్నాయి. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రాలకు కూడా మెల్లగా పాకుతున్నాడన్నమాట. దీని వెనుక ఉత్తరాది అహంకారం-దక్షిణాది ఆత్మగౌరవం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే నినాదమేమైనా వుందేమోనని రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.