శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (22:24 IST)

యు.ఎస్‌లో 'అఖిల్‌' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని ని  హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్‌ నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అఖిల్‌'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియోకు శ్రోతల నుంచి ట్రెమండస్‌ వస్తోంది. 
 
ఇప్పుడు 'అఖిల్‌' ఆడియోను యు.ఎస్‌.లోని మూడు ప్రదేశాల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. సెప్టెంబర్‌ 25న బే ఏరియాలో, సెప్టెంబర్‌ 26న డల్లాస్‌లో, సెప్టెంబర్‌ 27న న్యూ జెర్సీలో 'అఖిల్‌' ఆడియో ఫంక్షన్లను నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్లకు అఖిల్‌ అక్కినేనితోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులంతా హాజరవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అక్టోబర్‌ 22న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాత నితిన్‌ సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్‌, కోన వెంకట్‌, అనూప్‌, థమన్‌, అమోల్‌ రాథోడ్‌, రవివర్మ, ఎ.ఎస్‌.ప్రకాష్‌, గౌతంరాజు, భాస్కరభట్ల, కృష్ణచైతన్య, శేఖర్‌, గణేష్‌, జాని సాంకేతిక నిపుణులు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం(వెంకట్‌), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.