నాగార్జున 'మన్మథుడు' కాదు.. 'ముసలి' కింగ్

సోమవారం, 9 జులై 2018 (13:41 IST)

తెల్లగడ్డం... కాస్త నెరిసిన జుట్టు.. కళ్లజోడు... మెడలో ఎర్రతువాలు.. ఇదీ టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపుపొందిన అక్కినేని నాగార్జున వేషం. అంటే... టాలీవుడ్ మన్మథుడిగా పేరుగాంచిన అక్కినేని నాగార్జున ఇపుడు ముసలి కింగ్‌గా కనిపిస్తున్నాడు.
nagarjuna in devadas
 
ఈ ముసలి నాగార్జున పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. అచ్చం పల్లెటూరు తాతలా డిఫెరెంట్ లుక్‌లో నాగార్జునను చూసి నెటిజన్లు మురిపోతున్నారు. ఈ వేషంతో వెండితెరపై ఎలాంటి వేషం వేయాలన్నా అది నాగార్జునకే సాధ్యమనే కామెంట్స్ చేస్తున్నారు. 
 
అయితే, ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఈ లుక్ ఏ చిత్రంలోనిది అనేదే తేలాల్సి వుంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం నాగ్ కొత్తగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా లోనిదేనని ఘంటా పథంగా చెపుతున్నారు. 
 
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. 'దేవదాస్' అనే పేరుతో తెరకెక్కే ఈ చిత్రం పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారుకూడా. ప్రస్తుతం వైరల్ అవుతున్న నాగ్ పిక్ కూడా అందులోదే అయితే మాత్రం సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి. దీనిపై మరింత చదవండి :  
దేవదాస్ న్యూలుక్ టాలీవుడ్ Tollywood అక్కినేని నాగార్జున Devadas New Look Akkineni Nagarjuna

Loading comments ...

తెలుగు సినిమా

news

ఫస్ట్ లుక్‌లో ఇరగదీసిన "శైలజారెడ్డి అల్లుడు"

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా ...

news

కత్తి మహేష్‌ నగర బహిష్కరణ... నాగబాబు ఫుల్ సపోర్టు

వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు నగర ...

news

చికాగో వ్యభిచార దందాతో నాకు లింకుందా? రెజీనా స్పందన

ఇటీవల తెలుగు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన చికాగో వ్యభిచార దందాపై హీరోయిన్ రెజీనా కూడా ...

news

14న రజినీకాంత్ కోడలికి పెళ్లి?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కోడలి పిల్లకి ఈనెల 14వ తేదీన వివాహం జరుగనుంది. కోడలు అంటే.. ...